loader

పరువునష్టం కేసులో రూ.733 కోట్లు చెల్లించాలని ట్రంప్ కు కోర్టు ఆదేశం

ప్రజలే ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా ట్రంప్ కు మరో భారీ షాక్ తగిలింది. కాలమిస్ట్ ఈ. జీన్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో ట్రంప్ తరచుగా జీన్ కరోల్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగతంగా వివాదాస్పద ఆరోపణలు చేశారు. దీంతో కరోల్ కోర్టును ఆశ్రయించారు. ట్రంప్పై పరువునష్టం కేసు చేశారు. చివరికి దీనిపై విచారణ జరిపిన కోర్టు రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని […]

డబులు డెక్కర్‌ బస్సును ఢీకొట్టిన రైలు..8 మంది దుర్మరణం,

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన సెప్టెంబర్ 8న మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న అట్లాకో నగరంలో చోటుచేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు ను అకస్మాత్తుగా వచ్చిన ఓ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడ 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

దిగి వచ్చిన నేపాల్ ప్రభుత్వం.. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత

నేపాల్ లో ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకు వచ్చారు .. పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు ఈ  ఆందోళనల నేపథ్యంలో కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. అల్లర్లపై ప్రభుత్వం మంత్రులు, ఉన్నతాధికారులో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో ముఖ్యంగా అన్నిరకాల సోషల్ మీడియా బ్యాన్ లపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్‌లో 26 సోషల్ మీడియా యాప్‌లను శుక్రవారం నిలిచిపోయాయి. దీంతో […]

నేపాల్లో హింస.. హోంమంత్రి రాజీనామా

నేపాల్‌లో ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధానమంత్రికి పంపారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం, ముఖ్యంగా యువత ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా, అలాగే సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై నిరసన వ్యక్తం చేస్తూ నేపాల్‌లో యువత ఆందోళనలో పోలీసు కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి […]

ఆపిల్ ఐఫోన్-17 గ్రాండ్ లాంచింగ్ రేపే

టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ మెగా ఈవెంట్ సమయం దగ్గరపడింది. సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ‘ఆవ్ డ్రాపింగ్’ పేరుతో ఈవెంట్ జరగనుంది. ఈసారి ఆపిల్ నాలుగు కొత్త మోడళ్లు తీసుకురానుంది. అవి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. వీటిలో అత్యధిక చర్చనీయాంశం ఐఫోన్ 17 ఎయిర్. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో అత్యంత సన్నగా […]

సోషల్‌ మీడియా బ్యాన్‌పై నేపాల్‌లో ఆందోళనలు.. ఎనిమిది మంది మృతి

నేపాల్‌ లో ఘర్షణ వాతావరణం నెలకొంది.నేపాల్‌ ప్రభుత్వం ఇటీవలే సోషల్‌ మీడియాపై విధించిన నిషేధం హింసకు దారి తీసింది. సోమవారం న్యూ బనేశ్వర్, చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. నిరసనలో పాల్గొన్న వేలాది మంది యువకులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో భద్రతా దళాలు రబ్బర్‌ బుల్లెట్స్‌తో కాల్పులు జరిపారు. అంతేకాదు, టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్స్‌ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. […]

భారత్‌ – ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం..!

ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, భారత ఆర్థిక మంత్రి సంతకం చేసిన కొత్త ద్వైపాక్షిక ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) పై సంతకం చేశారు. పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను సులభతరం చేస్తుంది. భారత్‌ కొత్త పెట్టుబడి ఒప్పందాల నమూనాకు అనుగుణంగా, ఈ వ్యూహాత్మక ఒప్పందంపై భారత్‌ సంతకం చేసిన మొదటి OECD సభ్య దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌ మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ నేతృత్వంలోని

నేపాల్‌లో టెన్షన్.. టెన్షన్..! సోషల్‌ మీడియాపై నిషేధం..

నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. నేపాల్‌ పార్లమెంట్‌లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. సోషల్‌ మీడియాపై కూడా బ్యాన్‌ విధించారు. Gen-z పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడి యువత చేపట్టింది. ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. సోషల్‌ మీడియాపై బ్యాన్‌ ఎత్తేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

అప్పుడే పుతిన్‌ చర్చలకొస్తాడు: ట్రంప్‌ సన్నిహుతుడు స్కాట్‌ బెసెంట్‌

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే మాస్కో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడుఅధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు వస్తారని చెప్పారు. రష్యాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరోపియన్ భాగస్వాములు అందుకు సహకరించాలని వ్యాఖ్యానించారు.

ప్రారంభమైన చంద్రగ్రహణం…

భారతదేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. భాద్రపద పౌర్ణమి రోజున (సెప్టెంబర్ 7,8 తేదీల మధ్య రాత్రి) ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం… భారతదేశం సహా ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనిపించనుంది. భారతదేశంలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం… ఆదివారం రాత్రి 11 గంటలకు…గ్రహణ మధ్యస్థ కాలం… రాత్రి 11.42 గంటలు…సంపూర్ణ చంద్రగ్రహణం ముగింపు… అర్దరాత్రి 12.22 గంటలకు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON