ప్రజలే ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా ట్రంప్ కు మరో భారీ షాక్ తగిలింది. కాలమిస్ట్ ఈ. జీన్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో ట్రంప్ తరచుగా జీన్ కరోల్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగతంగా వివాదాస్పద ఆరోపణలు చేశారు. దీంతో కరోల్ కోర్టును ఆశ్రయించారు. ట్రంప్పై పరువునష్టం కేసు చేశారు. చివరికి దీనిపై విచారణ జరిపిన కోర్టు రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

