మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన సెప్టెంబర్ 8న మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న అట్లాకో నగరంలో చోటుచేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు ను అకస్మాత్తుగా వచ్చిన ఓ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడ 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

