నేపాల్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది.నేపాల్ ప్రభుత్వం ఇటీవలే సోషల్ మీడియాపై విధించిన నిషేధం హింసకు దారి తీసింది. సోమవారం న్యూ బనేశ్వర్, చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. నిరసనలో పాల్గొన్న వేలాది మంది యువకులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో భద్రతా దళాలు రబ్బర్ బుల్లెట్స్‌తో కాల్పులు జరిపారు. అంతేకాదు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.

