loader

జపాన్‌ నూతన ప్రధానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నూతన ప్రధాని గా ఎన్నికై తొలి మహిళా ప్రధాని గా గుర్తింపు దక్కించుకున్న సనే తకాయిచి కి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ప్రధాని ఒక పోస్టు పెట్టారు. భారత్‌-జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తకాయిచితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అదేవిధంగా ఈ ప్రాంతానికి వెలుపల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల నెలకొనడంలో ఇరుదేశాల బంధం కీలకపాత్ర పోషిస్తుందిని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల‌కు నిజ‌మైన దీపావ‌ళి.. హెచ్‌1 బీ వీసా ఫీజుపై కీల‌క ప్ర‌క‌ట‌న

USCIS ప్రకటన ప్రకారం, హెచ్‌–1బీ వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు కేవలం దేశం బయట నుంచి దరఖాస్తు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, అమెరికాలో చదువుకుంటున్న లేదా చెల్లుబాటు అయ్యే వీసా హోదాలో ఉన్నవారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎఫ్‌–1 విద్యార్థి వీసా కలిగి ఉన్నవారు  హెచ్‌–1బీకి మారినా ఫీజు అవసరం లేదు. ఇప్పటికే హెచ్‌–1బీ వీసా కలిగి ఉన్నవారు తమ వీసాను పొడిగించుకోవాలనుకున్నా, సవరణలు కోరుకున్నా లేదా హోదా మార్చుకున్నా […]

జపాన్‌‌లో సంచలనం.. దేశ తొలి మహిళా ప్రధానిగా సనాయే తకైచి ఎన్నిక !

జపాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రజలకు మొదటిసారి ఒక మహిళను ప్రధానమంత్రి స్థానంలో చూసే అవకాశం లభించింది. మంగళవారం సనాయే తకైచి (Sanae Takaichi)ను దేశ ప్రధానిగా పార్లమెంట్ దిగువ సభ ఎన్నికుంది. 64 ఏళ్ల ఈ సంప్రదాయవాద నాయకురాలు, చైనాపై బహిరంగ విమర్శలకు ప్రసిద్ధి. 465 స్థానాలున్న దిగువ సభలో తకైచికి 237 ఓట్లు లభించాయని, తద్వారా ఆమె మెజారిటీ మార్కును సునాయాసంగా దాటారని దిగువ సభ […]

మూతపడనున్న పిజ్జా హట్‌ రెస్టారెంట్లు..

పిజ్జా హట్ UK రెస్టారెంట్ డైన్-ఇన్ రెస్టారెంట్ వ్యాపారం పరిపాలనలోకి వెళ్లిన తర్వాత 68 రెస్టారెంట్లను మూసివేస్తామని తెలిపింది. పిజ్జా హట్ UKలో 68 రెస్టారెంట్లు, 11 డెలివరీ సైట్‌లను మూసివేయనున్నట్లు సమాచారం, దీని ఫలితంగా వాటిని నిర్వహిస్తున్న కంపెనీ పరిపాలనలోకి ప్రవేశించడంతో 1,210 ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. పిజ్జా హట్ UK రెస్టారెంట్లను నిర్వహిస్తున్న DC లండన్ పై లిమిటెడ్, సోమవారం FTI కన్సల్టింగ్‌ను నిర్వాహకుడిగా నియమించింది.

సముద్ర తీరంలో కాలిబూడిదైన నౌక.. 23 మంది భారతీయులు సేఫ్

యెమెన్‌లోని ఆడెన్ సముద్ర తీరంలో కామెరూన్ జెండా కలిగిన ఓడ MV ఫాల్కన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఓడలో భారీ పేలుడు కారణంగా మంటలు నౌక అంతటా వ్యాపించాయి. అయితే, అందులో ఉన్న 24 మంది సిబ్బందిని రక్షించి జిబౌటి కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. శనివారం (అక్టోబర్ 18, 2025) జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నౌకలో ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారని అధికారులు […]

కలలు కంటూనే ఉండు..! డొనాల్డ్‌ ట్రంప్‌ పరువుతీసిన ఇరాన్‌ అధ్యక్షుడు

జూన్‌లో అమెరికా దాడుల వల్ల ఇరాన్‌లోని అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తోసిపుచ్చారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో ఖమేనీ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. సైట్‌ల విధ్వంసంపై వ్యాఖ్యలపై “కలలు కంటూ ఉండండి” అని అన్నారు. “ఒక దేశం అణు పరిశ్రమను కలిగి ఉండాలా? లేదా అని చెప్పే హక్కు అమెరికాకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం- ఇద్దరి మృతి

కార్గో విమానం రన్‌వే‌పై ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది చనిపోయారు. తుర్కియే దేశపు ఏసీటీ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన బోయింగ్ 747 కార్గో విమానం హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈవిధంగా ప్రమాదానికి గురైంది.

ఇండియాకు మరోసారి ట్రంప్‌ వార్నింగ్‌! చెప్పింది వినకుంటే.. మరిన్ని సుంకాలు విధిస్తామంటూ

రష్యా చమురు కొనుగోలుపై భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్చరిక జారీ చేశారు. రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే భారత్‌ ‘భారీ సుంకాలను’ చెల్లిస్తూనే ఉంటుందని అన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. భారత్‌ త్వరలో రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని మరోసారి ట్రంప్‌ పేర్కొన్నారు.

అమెరికా యూనివర్సిటీలో కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. ఒక్లహోమా(Oklahoma) స్టేట్ యూనివర్సిటీ (OSU) రెసిడెన్స్ హాల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరు OSU విద్యార్థి అని యూనివర్సిటీ పోలీసులు ధృవీకరించారు. ఘటన తర్వాత గాయపడిన వారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు రెసిడెన్స్ హాల్‌కు తిరిగి వచ్చే సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ..

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోగల ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో తాజాగా భారీ చోరీ జరిగింది. నేపోలియన్ కాలానికి చెందిన అత్యంత విలువైన నగలను దొంగలు చోరీ చేశారు. ఫ్రాన్స్ రాజకుటుంబానికి చెందిన నగలను పెట్టిన అపోలో గ్యాలరీలోని గదిలో ఈ చోరీ జరిగింది. ప్రత్యేక నిచ్చెన సాయంతో పైకెక్కిన దుండగులు కిటీలను ప్రత్యేక కట్టర్‌లతో తొలగించి లోపలికి ప్రవేశించారు. ఏడు నిమిషాల వ్యవధిలో నగలను తీసుకుని బయటపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON