ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోగల ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో తాజాగా భారీ చోరీ జరిగింది. నేపోలియన్ కాలానికి చెందిన అత్యంత విలువైన నగలను దొంగలు చోరీ చేశారు. ఫ్రాన్స్ రాజకుటుంబానికి చెందిన నగలను పెట్టిన అపోలో గ్యాలరీలోని గదిలో ఈ చోరీ జరిగింది. ప్రత్యేక నిచ్చెన సాయంతో పైకెక్కిన దుండగులు కిటీలను ప్రత్యేక కట్టర్లతో తొలగించి లోపలికి ప్రవేశించారు. ఏడు నిమిషాల వ్యవధిలో నగలను తీసుకుని బయటపడ్డారు.

