USCIS ప్రకటన ప్రకారం, హెచ్–1బీ వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు కేవలం దేశం బయట నుంచి దరఖాస్తు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, అమెరికాలో చదువుకుంటున్న లేదా చెల్లుబాటు అయ్యే వీసా హోదాలో ఉన్నవారికి
ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎఫ్–1 విద్యార్థి వీసా కలిగి ఉన్నవారు హెచ్–1బీకి మారినా ఫీజు అవసరం లేదు. ఇప్పటికే హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారు తమ వీసాను పొడిగించుకోవాలనుకున్నా, సవరణలు కోరుకున్నా లేదా హోదా మార్చుకున్నా ఈ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.

