కార్గో విమానం రన్‌వేపై ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది చనిపోయారు. తుర్కియే దేశపు ఏసీటీ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 747 కార్గో విమానం హాంకాంగ్ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈవిధంగా ప్రమాదానికి గురైంది.

