రష్యా చమురు కొనుగోలుపై భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్చరిక జారీ చేశారు. రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే భారత్ ‘భారీ సుంకాలను’ చెల్లిస్తూనే ఉంటుందని అన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. భారత్ త్వరలో రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని మరోసారి ట్రంప్ పేర్కొన్నారు.

