loader

యుఎఇలో కురిసిన భారీ వర్షాలు: భారతీయుడు మృతి

యుఎఇలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. శిథిలావస్థలకు చేరుకున్న భవనాలు కుప్పకూలిపోతున్నాయి. రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో గోడ కూలడంతో భారతీయుడు మృతి చెందాడు. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు సల్మాన్ ఫరీజ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. భవనం గోడ కూలిపోవడంతో సల్మాన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు

నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం… ఏడుగురు దుర్మరణం

నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మాజీ నాస్కార్ రేసింగ్ డ్రైవర్, రిటైర్డ్ దిగ్గజం గ్రెగ్ బిఫిల్ దుర్మరణం చెందారు. బిఫిల్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతుండగా విమానం కుప్పకూలి భారీగా మంటలు చెలరేగాయి. నాస్కార్ చరిత్రలోని 75 మంది గొప్ప డ్రైవర్లలో ఒకరిగా బిఫిల్ గుర్తింపుపొందారు. బిఫిల్ […]

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత- అర్ధరాత్రి భారత వ్యతిరేక ఆందోళనలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్‌ మంచ్‌ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ హైది మరణించడంతో గురువారం అర్ధరాత్రి చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో, చట్టోగ్రామ్ పోర్ట్ నగరంలోని ఖుల్షీ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకారులు గుమిగూడారు. హాది హత్యను ఖండిస్తూ, అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

అమెజాన్‌లో లేఆఫ్స్…లక్సెంబర్గ్‌లో 370 మంది ఉద్యోగుల తొలగింపు

టెక్ దిగ్గజ కంపెని అమెజాన్‌ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. లక్సెంబర్గ్‌లో యూరప్ ప్రధాన కార్యాలయంలో ఏకంగా 370కి పైగా అమెజాన్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఉద్యోగుల తొలగింపు అమెజాన్ కంపెనీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద లేఆఫ్స్‌గా నిలిచింది. ప్రారంభంలో అమెజాన్ 470 ఉద్యోగులను తొలగించాలని ప్రణాళికలు వేసింది కానీ, యూరోపియన్ యూనియన్ కార్మిక చట్టాల ప్రకారం తప్పనిసరి చర్చల సమయంలో ఆ సంఖ్యను తగ్గించింది

హెచ్1 బీ దరఖాస్తుదారులు అక్టోబర్ వరకు ఆగాల్సిందే !

అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో హెచ్1 బీ దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి తలెత్తింది. అనేక మంది వీసా దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరు వరకు వాయిదా పడినట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని , అందువల్లే ఇంటర్వూలను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు.

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన నాలుగురోజులు మూడుదేశాల పర్యటనలో భాగంగా ఒమన్ లో పర్యటిస్తున్నారు. మస్కట్ లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో మోడీ ప్రసంగించారు. మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్స రాలు పూర్తయ్యాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి’ అని మోడీ ఆకాంక్షించారు.

ఒమన్‌లో మినీ ఇండియాను చూస్తున్నా: ప్రధాని మోడీ

ఒమన్‌లో రెండో రోజు భారతీయులతో ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ జరిపారు. స్కూల్‌ విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వికసిత్‌ భారత్‌లో కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీది కీలక భూమిక పోషిస్తుందని, ఒమన్‌లో తాను ఒక మినీ ఇండియాను చూస్తున్నానని ప్రశంసించారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా మహా సముద్రంలో రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారిధి ఏర్పాటు చేశామన్నారు.

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య యుద్ధం మరింత ఉద్రిక్తలమధ్య కొనసాగేలా ఉంది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఐరోపా నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పందిపిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోఒకరోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ట్రంప్‌కు బిగ్ షాక్.. FBI డిప్యూటీ డైరెక్టర్ పదవికి డాన్ బోంగినో రాజీనామా

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పది నెలల లోపే డాన్ బోంగినో (51) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాల్లో అటార్నీ జనరల్ పామ్ బాండీతో బోంగినోకు మధ్య సఖ్యత లేకపోవడమే ఈ ఆకస్మిక రాజీనామాకు దారితీసిందని కథనాలు వస్తున్నాయి న్యూయార్క్ పోలీస్ ఆఫీసర్‌గా, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడిగా, పాడ్‌కాస్టర్‌గా […]

బంగ్లాదేశ్‌లో రెచ్చిపోయిన ర్యాడికల్స్.. ఢాకాలో భారత ఎంబసీపై దాడికి యత్నం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. భద్రతా కారణాల రీత్యా డిసెంబరు 17న బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢాకాలోని రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు భారత ప్రకటించింది. ఢాకాలోని ఎంబసీకి బెదిరింపులు, బంగ్లా రాజకీయ నాయకుల విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ ఇప్పటికే స్పందించి, భారత్ నిరసన తెలియజేసిన కొద్ది గంటల్లోనే ఢాకాలోని ఎంబసీపై దాడికి యత్నించడం

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON