అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో హెచ్1 బీ దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి తలెత్తింది. అనేక మంది వీసా దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరు వరకు వాయిదా పడినట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని , అందువల్లే ఇంటర్వూలను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు.

