బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది మరణించడంతో గురువారం అర్ధరాత్రి చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో, చట్టోగ్రామ్ పోర్ట్ నగరంలోని ఖుల్షీ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకారులు గుమిగూడారు. హాది హత్యను ఖండిస్తూ, అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

