loader

ఐరోపా దారి తప్పింది.. అమెరికాదే అద్భుత ప్రగతి: దావోస్‌లో ట్రంప్ ఫైర్

దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక ‘ఎకనామిక్ మిరకిల్’ అని అభివర్ణించారు. ఐరోపా దేశాలు సరైన దిశలో వెళ్లడం లేదని, అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నాటో కూటమి దేశాలు రక్షణ వ్యయం విషయంలో అమెరికాపై భారం మోపుతున్నాయని, తాము రక్షణ కల్పిస్తున్నా తగిన మూల్యం చెల్లించడం లేదని మండిపడ్డారు. గ్రీన్లాండ్ ప్రతిపాదనను తిరస్కరించడం పట్ల, వారు కృతజ్ఞత […]

రాచెల్ మెక్‌ఆడమ్స్‌కు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు

హాలీవుడ్ వెండితెరపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి రాచెల్ మెక్‌ఆడమ్స్ అరుదైన గౌరవం ద‌క్కించుకుంది. సినీ రంగంలో ఆమె అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్’ (Hollywood Walk of Fame)లో 2,833వ నక్షత్రాన్ని(Star) ఆమెకు కేటాయించి ఘనంగా గౌరవించారు. లాస్ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో రాచెల్ మెక్‌ఆడమ్స్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు.

భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్

“నన్ను చంపేస్తే.. ఇరాను భూస్థాపితం చేస్తాం” అంటూ ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించారు. ‘న్యూస్ నేషన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుణ్ని ఏ దేశమైనా చంపితే, అమెరికా సైన్యం సైలెంటుగా ఎందుకు ఉంటుంది? కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ట్రంప్.. తనను ఇరాన్ చంపితే, ఆ తర్వాత భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా.. మా వాళ్లకు ముందే ఆదేశాలిచ్చానంటూ వ్యాఖ్యానించారు.

ట్రంప్ పాలనకు ఏడాది పూర్తి- అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు

రెండోసారి అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. జనవరి 20తో ఏడాది కాలం పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా వివిధ  సంఘాల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్లకార్లుడు, దిష్టిబొమ్మలతో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ పాలన వల్ల అమెరికా అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న అంతర్జాతీయ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు.

నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన ప్రసిద్ధ అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్ నాసా నుండి రిటైర్ అవ్వడం ద్వారా అంతరిక్ష విజ్ఞానంలో ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది. దాదాపు 27 సంవత్సరాల పాటు అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ నాసాలో పనిచేసిన తరువాత, ఆమె అంతరిక్ష కెరీర్ ముగించారు. పదవీ విరమణకు ముందు సునీతా విలియమ్స్ నాసా అత్యంత సీనియర్ వేతన స్థాయి GS-15 లో పనిచేశారు. ఆమె సంవత్సరానికి దాదాపు 1.20 నుండి 1.30 కోట్ల రూపాయల […]

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి – ఓ తరం అభివృద్ధి చెందాలి: సీఎం చంద్రబాబు

అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే వన్ ఫ్యామిలీ-వన్ ఆంట్రపెన్యూర్‌ విధానం తెచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వన్ ఫ్యామిలీ-వన్ ఆంట్రపెన్యూర్‌ విధానంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి, ఓ తరం అభివృద్ధి చెందాలన్నారు. తన ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాలన్నారు.

ఓమన్‌లో భారతీయులకు ఊహించని షాక్! ఆ ఉద్యోగాలపై శాశ్వత నిషేధం..

వలస కార్మికులకు గల్ఫ్ దేశమైన ఒమన్ పిడుగు లాంటి వార్త చెప్పింది. కీలక కార్మిక సంస్కరణ (Labour reform) తీసుకొచ్చింది. ఇది 200 కంటే ఎక్కువ వృత్తులలో ప్రవాసులు పనిచేయకుండా నిషేధిస్తుంది. ప్రభుత్వం అన్ని రెస్ట్రిక్టెడ్‌ రోల్స్‌ డీటైల్డ్‌ లిస్టుని రిలీజ్‌ చేయలేదు. అయితే ఈ నిషేధం హాస్పిటాలిటీ; అడ్మినిస్ట్రేటివ్‌, క్లెరికల్‌ సర్వీసెస్‌ రంగాలు,సూపర్వైజరీ రోల్స్‌, కొన్ని మేనేజ్‌మెంట్‌ పొజిషన్స్‌కి వర్తిస్తుందని అధికారులు ధృవీకరించారు. ఇవి భారతీయుల సహా ప్రవాసులు ఎక్కువగా పని చేసే రంగాలు కావడం […]

గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

గ్రీన్ ల్యాండ్ కు సంబంధించి నార్త్‌ అమెరికా ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్‌(NORAD) ఈరోజు ఒక ప్రకటనను విడుదల చేసింది. గ్రీన్ ల్యాండ్ కు తమ యుద్ధ విమానాలను పంపినట్లు అందులో తెలిపింది. ఆ ద్వీపంలోని పిటుఫిక్ అంతరిక్ష బేస్ లో యుద్ధ విమానం ల్యాండ్ అయిందని చెప్పింది. నార్త్‌ అమెరికా రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే లక్ష్యంలో భాగంగా దీన్ని మోహరించనున్నట్లు తెలిపింది. గ్రీన్ ల్యాండ్ ప్రభుత్వానికి ముందుగానే తెలిపామని..డెన్మార్క్ సమన్వయంతోనే ఈ కార్యకలాపాలు జరిగాయని చెప్పింది.

భారీ మంచు తుఫాను.. వందకి పైగా వాహనాలు ఢీ

అమెరికాలో మంచు తుఫాను తీవ్ర స్థాయికి చేరింది. మిచిగాన్ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఇంటర్‌స్టేట్ హైవే మీద గ్రాండ్ రాపిడ్స్ సమీపంలోని హడ్సన్‌విల్లే ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం(జనవరి 19) ఉదయం 100కి పైగా వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో డజన్ల కొద్దీ వాహనదారులు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు.

భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు ఏడుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే పెద్ద పెద్ద కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రాయబార కార్యాలయాలు ఉన్న వాణిజ్య షహర్-ఎ-నావ్ పరిసరాల్లోని ఒక హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, షహర్-ఎ-నవ్ కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్‌లోని సర్జికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON