అమెరికాలో మంచు తుఫాను తీవ్ర స్థాయికి చేరింది. మిచిగాన్ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఇంటర్‌స్టేట్ హైవే మీద గ్రాండ్ రాపిడ్స్ సమీపంలోని హడ్సన్‌విల్లే ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం(జనవరి 19) ఉదయం 100కి పైగా వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో డజన్ల కొద్దీ వాహనదారులు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు.

