loader

బంగ్లాదేశ్‌కు భారత్ స్నేహ హస్తం.. కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్‌‌కు ఢిల్లీకి ఆహ్వానం..!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం కొత్తగా ఎన్నికైన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్‌ను కలిసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి వ్యక్తిగత అభినందన లేఖను అందజేశారు. భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఓం బిర్లా రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఓం బిర్లా భారతదేశ శుభాకాంక్షలు తెలియజేసి, దేశాన్ని సందర్శించమని ఆహ్వానించారు.

బంగ్లాదేశ్ ప్రధానిగా రెహమాన్ ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్(60) ప్రమాణ స్వీకారం చేశారు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వ పాలనకు తెరపడినట్లయింది. సాంప్రదాయానికి భిన్నంగా బంగభవన్‌కు బదులు జతియా సంసద్ సౌత్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెహమాన్ చేత అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణం చేయించారు.రెహమాన్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా, దివంగత అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్‌ల కుమారుడు. ప్రమాణ స్వీకారానికి ముందు రెహమాన్‌ను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బిఎన్‌పి) ఎంపిలు పార్లమెంటరీ పార్టీ […]

ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. బిలేగేట్స్ కు నో ఎంట్రీ?

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్ కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ బిల్ గేట్స్పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పున:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

భారత్ సహాయం మాకు అత్యంత కీలకం : ఐరాస చీఫ్ గుటెరెస్

అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల పరిధిలో తొలిసారిగా భారత్‌ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

ఇండియా- యూకే ట్రేడ్​ డీల్​ ఏప్రిల్​ నుంచే అమల్లోకి!

భారత్‌- బ్రిటన్‌ మధ్య గతేడాది జులైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026 ఏప్రిల్‌లో అమలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫలితంగా భారత్‌ నుంచి వెళ్లే 99శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. అదేవిధంగా, భారత్​లో కార్లు, విస్కీ వంటి బ్రిటిష్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గనున్నాయి. 2025 జులై 24న సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA)పై భారత్​- యూకేలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం 34బిలియన్‌ […]

బంగారం ధరలపై బాంబు పేల్చిన అమెరికా.. సంచలన ప్రకటన

చైనాకు చెందిన రిటైల్ పెట్టుబడిదారులు, పెద్ద సంస్థలు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్లే ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లలో జరుగుతున్న అస్థిరమైన ట్రేడింగ్ వల్లనే బంగారం ధరలు నియంత్రణ లేకుండా మారుతున్నాయని ఆయన విమర్శించారు. పసిడి ధరల్లో కనిపిస్తున్న ఈ తీవ్రమైన ఒడిదుడుకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. .

హాలీవుడ్‌ను తలదన్నే ఏఐ.. వీడియో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది?

టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఈ వారం ‘సీడెన్స్ 2.0’ (SeaDence 2.0) అనే సరికొత్త ఏఐ వీడియో మోడల్‌ను విడుదల చేసింది. ఈ సాంకేతికత ప్రదర్శిస్తున్న ఫలితాలు చూసి సాంకేతిక నిపుణులు విస్తుపోతున్నారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ మోడల్ సామర్థ్యాన్ని కళ్లకు కడుతోంది. హాలీవుడ్ ప్రముఖ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూయిజ్ మధ్య జరిగిన ఒక పోరాట సన్నివేశాన్ని ఈ మల్టీ-మోడల్ ఏఐ […]

మరో 18 నెలలో వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు- మైక్రో సాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా

మరి కొద్ది నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు చాలా వరకు ఆటోమేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. డాక్యుమెంట్ ఇన్‌స్పెక్షన్, ఫైనాన్షియల్ అనాలసిస్, కాంప్లియన్స్ చెక్, మార్కెటింగ్ ఆప్టిమైజేషన్, షెడ్యూలింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితమవుతాయిని తెలిపారు. మనుషులు రోజువారీగా చేసే అన్ని పనుల్ని సమర్థంగా చేయగల ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసే పనిలో మైక్రోసాఫ్ట్ ఉందని, ఇది అత్యంత శక్తిమంతమైన ఏఐ టూల్ అని […]

చైనా స్కీయర్లకు రహస్యంగా కోట్ల నిధులు

అమెరికాలో పుట్టి చైనా జాతీయ జట్టు తరఫున పోటీల్లో పాల్గొన్న స్టార్ స్కీయర్ ఐలీన్ గూ, మరో క్రీడాకారిణి జూ యీకి చైనా ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో భారీగా నిధులు చెల్లించినట్లు ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ మొత్తం సుమారు రూ.116 కోట్లకు సమానమని ఆ నివేదిక పేర్కొంది. విదేశీ పౌరసత్వం కలిగిన క్రీడాకారులను  ప్రోత్సహిస్తున్నారన్న , ద్వంద్వ పౌరసత్వంపై వచ్చే రాజకీయ దుమారం నుంచి తప్పించుకోవడానికి అధికారులు ఆమె పేరు […]

నవల్నీకి విషమిచ్చి చంపారు.. పుతిన్ ప్రభుత్వంపై యూరప్ విమర్శ

రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని విషమిచ్చి చంపేశారని ఐదు యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి. ఆయనకు అత్యంత ప్రమాదకర ప్రాణాంతక టాక్సిన్ శరీరంలోకి పంపించారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు ఆరోపించారు. నవన్లీ మృతదేహం అవశేషాల నమూనాలను విశ్లేషించగా ఆయనకు దక్షిణ అమెరికాలో దొరికే టాక్సిన్ ఎక్కించినట్లు వెల్లడైందని,ఈ దారుణ చర్యకు దిగింది రష్యా ప్రభుత్వమే అని ఈ నేతలు తమ ప్రకటనలో తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON