అమెరికాలో పుట్టి చైనా జాతీయ జట్టు తరఫున పోటీల్లో పాల్గొన్న స్టార్ స్కీయర్ ఐలీన్ గూ, మరో క్రీడాకారిణి జూ యీకి చైనా ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో భారీగా నిధులు చెల్లించినట్లు ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ మొత్తం సుమారు రూ.116 కోట్లకు సమానమని ఆ నివేదిక పేర్కొంది. విదేశీ పౌరసత్వం కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్న , ద్వంద్వ పౌరసత్వంపై వచ్చే రాజకీయ దుమారం నుంచి తప్పించుకోవడానికి అధికారులు ఆమె పేరు బడ్జెట్ రికార్డుల నుంచి తొలగించినట్లు సమాచారం.

