loader

నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి

ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యు తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

ఇరాన్ ఆపద్ధర్మ నేతగా అయతుల్లా రెజా

ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి.

దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో విమానాశ్రయం లోపలి భాగంలో కొంత నిర్మాణానికి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన కారణంగా నలుగురు విమానాశ్రయ ఉద్యోగులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. దుబాయ్ నగరానికి చిహ్నంగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఏడు నక్షత్రాల హోటల్ ‘బుర్జ్-అల్-అరబ్’పై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఆకాశంలోనే డ్రోన్లను కూల్చివేసినా, వాటి శిథిలాలు పడటంతో […]

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! ఇకపై సిమ్‌ బైండింగ్‌ తప్పనిసరి

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ భద్రతను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తోంది. మార్చి 1 నుండి ప్రభుత్వం కొత్త సిమ్-బైండింగ్ నియమాన్ని అమలు చేస్తోంది. మీరు మీ వాట్సాప్ ఖాతాను మీ ప్రధాన ఫోన్‌లోని భౌతిక సిమ్ కార్డ్‌తో ముడిపడి ఉంచాలి.  సిమ్ బైండింగ్‌తో, మీ సిమ్ ఇప్పటికీ మీ ప్రధాన ఫోన్‌లో ఉందో లేదో చూడటానికి వాట్సాప్ ప్రతి ఆరు గంటలకు తనిఖీ చేస్తుంది. దాన్ని తీయండి దానిని మార్చుకోండి లేదా నిష్క్రియం చేయండి, మీరు మళ్ళీ […]

USS అబ్రహం లింకన్‌ విమాన వాహన నౌకపై ఇరాన్‌ క్షిపణుల వర్షం!

సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత తీవ్రంగా స్పందించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికా విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ఇదే విషయం గురించి తెలిపింది. అబ్రహం లింకన్ విమాన వాహక నౌక వైపు నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా […]

మీ యుద్ధం మాతో కాదు.. ఇరాన్‌పై యూఏఈ అధ్యక్షుడు ఆగ్రహం

ఇరాన్ పొరుగున ఉన్న యూఏఈ (UAE), ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై క్షిపణి వర్షం కురిపిస్తోంది. ఇరాన్ తీరుపై యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొరుగు దేశాలపై, సామాన్య ప్రజలపై దాడులు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ యుద్ధం పొరుగు దేశాలతో కాదు, శత్రువులతో తేల్చుకోండి. శాంతియుతంగా ఉన్న గల్ఫ్ దేశాలను ఈ రక్తపాతంలోకి లాగడం తగదు” అని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు.

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ఇరాన్ వీధుల్లో సంబరాలు!

ఖమెనీ పాలనా కాలంలో ఆ దేశ ప్రజలు చాలాసార్లు కఠిన నిబంధనలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతితో ఇరాన్‌లో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆందోళనకారులు. పలు నగరాల్లో కేకలు వేస్తూ, బాణా సంచా కాల్చుతూ సంబరాలు చేసుకోగా.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతమొందాలనే నినాదాలతో అక్కడి వీధులు మార్మోగినట్టు తెలుస్తోంది. ఆ దేశంలోని పలువురు మహిళలు హిజాబ్ తీసేసి మరీ సంబారాల్లో పాల్గొన్నారు తమ నియంత మరణించాడని హర్షం వ్యక్తం చేస్తూ వీధుల్లో స్టెప్పులేశారు.

ఖమేనీ తర్వాత కౌన్సిల్ చేతిలోకి ఇరాన్ పగ్గాలు

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో పాలన పగ్గాలు మారాయి. సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్కు మారింది. అందుకోసం తాత్కాలికంగా ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్‌ ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఇందులో ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియన్‌, న్యాయవ్యవస్థ అధిపతి హొస్సేన్‌ మొహ్‌సెని ఎజెయ్‌, గార్డియన్‌ కౌన్సిల్‌ నుంచి ఒకరు ఉండనున్నారు. కొత్త సుప్రీం నేతను నియమించేవరకు ఈ కౌన్సిల్‌ తాత్కాలికంగా పాలనా బాధ్యతలను చూసుకోనుంది

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. : అధికారికంగా ధృవీకరించిన ఇరాన్ మీడియా

ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా తాజాగా ధృవీకరించింది. కొన్ని గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఏడు రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇస్తున్నట్లు స్పష్టం చేసింది

దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, పీవీ సింధు, ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళుతున్న సింధు, శనివారం దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ట్రాన్సిట్ హబ్‌గా ఉన్న దుబాయ్ చేరుకున్న తర్వాత ఆమె ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. యుద్ధ వాతావరణం కారణంగా సింధుతో పాటు వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON