అత్యంత పలుచని డిజైన్‌తో స్లిమ్ ఐఫోన్ మోడల్‌ను లాంచ్ చేసిన యాపిల్..
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తాజాగా నిర్వహించిన తన ఈవెంట్లో ఐఫోన్ 17 ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఇదే ఈవెంట్లో ఐఫోన్ ఎయిర్ పేరిట మరో ఐఫోన్ మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది యాపిల్‌కు చెందిన ఎయిర్ సిరీస్‌లో వచ్చిన మొదటి ఐఫోన్ కావడం మాత్రమే కాకుండా, అత్యంత పలుచని ఐఫోన్ కావడం కూడా విశేషం. చాలా స్లిమ్ డిజైన్‌తో లాంచ్ చేశారు. కేవలం 5.6ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది.