ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు
ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రభుత్వ విభాగాలన్నీ తక్షణం నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. నిఘా, మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి క్లాడ్‌లోని భద్రతా నిబంధనలను పూర్తిగా తొలగించేందుకు ఆంథ్రోపిక్ అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖకు మాత్రం ఆరు నెలల సమయం ఇచ్చారు.

