loader

ఐపిఎల్-2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మిగితా షెడ్యూల్‌ని విడుదల చేస్తామని ఐపిఎల్ బోర్డు […]

కీర్తి ఆజాద్ ఎవరు?.. ఆయన కామెంట్లను ఎవరు పట్టించుకుంటారు’..?

భారత జట్టు వరల్డ్‌ కప్ ట్రోఫీని మొదటగా హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లడంపై మాజీ ఆటగాడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ గెలుపొందాకట్రోఫీతో కలిసి ఆలయంలోకి వెళ్లినందుకు భారత ఆటగాళ్లు సిగ్గుపడాలి అని ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఇషాన్ కిషన్‌ మీడియా ప్రశ్నించింది. ఇంతకూ కీర్తి ఆజాద్ ఎవరు? ఆజాద్ మాటల్ని ఎవరు పట్టించుకుంటారు?’ అని ఇషాన్ మాజీ ఆటగాడి గాలి తీసేశాడు.

టీ20 వరల్డ్ కప్ విజేత టీమ్‌ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా- ఎవరికెంత?

టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్​ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న వేళ, రూ.131 కోట్ల నగదు బహుమతిని అందించనుంది. ఈ మొత్తాన్ని 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్​కు పంచుతారు. ఇందులో ఎక్కువ భాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్‌కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు.

స్విస్ ఓపెన్ నుంచి సింధు ఔట్.. లక్ష్య సేన్ డౌటే..!

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు దూరమైంది. మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకున్న తెలుగు తేజం ఇంకా కుదురుకోలేదు. దాంతో.. వెంటనే కోర్టులోకి దిగేందుకు ఆమె సిద్ధంగా లేదు. సో.. స్విట్జర్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని సింధు నిర్ణయించుకుంది. రెండోసారి కూడా ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కంగుతిన్న లక్ష్య సేన్ సైతం ఈ పోటీల్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.

జయహో ‘భారత్’- విశ్వవిజేత

ప్రతి ఆశ, ప్రతి వాదన, ప్రతి కోరిక నిజమని నిరూపితమయ్యాయి.. గత రెండేళ్లుగా పడ్డ కష్టం, మార్పులు, వ్యూహాలు చివరకు విజయ తీరానికి చేరుకున్నాయి. అవును, టీమ్ ఇండియా మొదటి నుంచి అందరూ ఆశించినట్లే అద్భుతం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి, రికార్డు స్థాయిలో మూడోసారి […]

వరుసగా మూడో హాఫ్ సెంచరీతో సంజూ శాంసన్ రికార్డు

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజీలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతడు మరోసారి అర్ధశతకం నమోదు చేసి టోర్నమెంట్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు మూడు సార్లు చేసిన ఏడో బ్యాటర్‌గా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు చేసిన మూడో […]

అహ్మదాబాద్‌లోని స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ నంబర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తాయి, మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 180కి పైగానే ఉంటుంది. అయితే ఈ టోర్నీలో మాత్రం స్కోర్లు 170-180 మధ్యలో నమోదవుతున్నాయి. పిచ్ పొడిగా ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలనే ఆలోచనతో ఉండవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 30 డిగ్రీల సెల్సియస్‌, ఆట ముగిసే సమయానికి […]

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ పోరుకు ముందు, అంతర్జాతీయ పాప్ సింగర్ రికీ మార్టిన్ (Ricky Martin) తన అద్భుతమైన ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది అభిమానుల కోసం మధ్యాహ్నం 3:30 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకుంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకు కాదు.. అత‌నికి ఇవ్వాలి : సంజూ శాంస‌న్‌

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో భార‌త్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన సంజూ శాంస‌న్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఆ అవార్డు అందుకున్న త‌ర్వాత సంజూ మాట్లాడుతూ.. ఈ అవార్డు త‌న‌కు ద‌క్కాల్సింది కాద‌న్నారు. భార‌త జ‌ట్టు విజ‌యంలో బౌల‌ర్ బుమ్రా కీల‌క పాత్ర పోషించిన‌ట్లు పేర్కొన్నారు. గెలుపు క్రెడిట్ బుమ్రాకే ద‌క్కుతుంద‌ని, అత‌నో ప్ర‌పంచ మేటి బౌల‌ర్ అని,  సెమీస్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడ‌ని, ఈ అవార్డు వాస్త‌వానికి […]

T20 World Cup 2026 ఫైనల్స్‌కు భారత్

ఇంగ్లాండ్‌పై టీం ఇండియా భారీ విక్టరీ సాధించింది. వరుసగా రెండోవసారి ఫైనల్స్‌కు వెళ్లిన భారత్… ఈ నెల 8న అహ్మదబాద్‌లో కీవిస్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సంజు 89 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్, శివమ్ దూబే వరుసగా 39, 43 పరుగులతో విజృంభించి ఔటయ్యారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) చేసిన పవర్-హిట్టింగ్ భారత్ 250 పరుగుల మార్కును దాటడానికి దోహదపడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON