అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ నంబర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తాయి, మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 180కి పైగానే ఉంటుంది. అయితే ఈ టోర్నీలో మాత్రం స్కోర్లు 170-180 మధ్యలో నమోదవుతున్నాయి. పిచ్ పొడిగా ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలనే ఆలోచనతో ఉండవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 30 డిగ్రీల సెల్సియస్, ఆట ముగిసే సమయానికి 25 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది.

