ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ పోరుకు ముందు, అంతర్జాతీయ పాప్ సింగర్ రికీ మార్టిన్ (Ricky Martin) తన అద్భుతమైన ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది అభిమానుల కోసం మధ్యాహ్నం 3:30 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకుంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

