గుకేశ్ కు ఎలాన్ మస్క్ అభినందనలు . . .
భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ను ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 18 ఏళ్లకే ఇలా వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.