సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు దారుణ ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. అహ్మదాబాద్‌లో టీమిండియా ఓటమిలో కీలకమైన డేవిడ్ మిల్లర్ తో రీల్ చేసింది తను. మ్యాచ్ అనంతరం మిల్లర్‌తో మైదానంలో చేసిన రీల్‌ను సోషల్ మీడియలో పోస్ట్ చేసిన ప్రిన్సీ.. ‘మిల్లర్ అద్భుతమైన బ్యాటర్ కదా.. ’ అని క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది.. కొందరు అమెను ట్రోల్ చేస్తూ.. బెదిరింపులకు దిగారు. అత్యాచారం చేస్తామని, బొండంలా ఉన్నావని.. ఇలా బాడీషేమింగ్‌తో బాధ పెట్టారు. ఇవన్నీ భరించలేక తను ఈ రీల్‌ను తొలగించింది.

