loader

బిహార్ ఎన్నికల ప్రభావం -హైదరాబాద్‌లో పనులు మందగింపు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే దాదాపు 8 లక్షల మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగానికి చెందినవారే. కొందరు హోటల్స్, రోడ్ వర్క్స్, మరియు చిన్న చిన్న వ్యాపార రంగాల్లోనూ ఉన్నారు. ఎన్నికల కారణంగా వీరు దాదాపు 10 రోజులపాటు గైర్హాజరు అవుతారని అంచనా. ఫలితంగా ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి, కాంట్రాక్టర్లకు అదనపు వ్యయం వస్తుంది.

ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి:సీఎం రేవంత్ ఫైర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు షేక్‌పేట డివిజన్, పారామౌంట్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, కిషన్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నారని, పీజేఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ఆనాడు అవమానించారని, అందుకే పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టు..ఆర్జేడీ మండిపాటు

బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించినట్లు వెల్లడించింది. జార్ఖండ్‌ బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు ఫూల్ జోషి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై బీజేపీ, విజయ్ బీజేపీ’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ‘దైనిక్ భాస్కర్’ ఆమెపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది.

సజ్జల బాధ్యతలపై జగన్ కీలక నిర్ణయం

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల తీసుకుంటున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇంఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఏడాది ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి భార్గవ రెడ్డిని తప్పించారు. ఇప్పుడు భార్గవ రెడ్డికి సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్ గా నియమిస్తూ తాజాగా […]

బిహార్‌ తొలి విడత సమరానికి అంతా రెడీ

బిహార్‌ తొలి విడత సమరానికి రంగం సిద్ధమైంది. 243 స్థానాలకుగాను తొలి దశలో 121 నియోజకవర్గాలకు గురువారం ఓటింగ్‌ జరగనుంది. తొలి విడతలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3.75కోట్ల ఓటు వేయనున్నారు. అందులో 122 మంది మహిళా అభ్యర్థులు కాగా జన్‌ సురాజ్‌ పార్టీ తరఫున ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా బరిలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 45వేల 341పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో 36వేల 733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 10.72లక్షల […]

రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం..

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల దొంగతనం అంశాన్ని లేవనెత్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు హైకోర్టులో 22 ఎన్నికల పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో లేదా ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని ఏ పార్టీ అభ్యర్థి అయినా విశ్వసిస్తే అప్పీల్ దాఖలు చేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క అప్పీల్ కూడా దాఖలు చేయలేదని కేంద్ర ఎన్నికల […]

స్విటీ, సీమా, సరస్వతి… బ్రెజిల్ మోడల్ ఫొటోతో 22 ఓట్లు…రాహుల్ గాంధీ

2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని ఆరోపించారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు… వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని అన్నారు. ఈ ఫోటోగ్రాఫ్ సీమా, స్వీటీ మరియు సరస్వతి వంటి వివిధ పేర్లతో ఓటర్ల జాబితాలో అనేకసార్లు కనిపించిందని అన్నారు. హర్యానాలోని 10 వేర్వేరు బూత్‌లలో ఈ ఫొటోతో 22 ఓట్లు […]

టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌

తమిళిగ వెట్రి కళగం పార్టీ (TVK party) ముఖ్యమంత్రి అభ్యర్థి గా ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం చెన్నై లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ‘టీవీకే స్పెషల్‌ జనరల్ కౌన్సిల్‌ మీటింగ్‌ ’ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. జాతీయస్థాయిలో  ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు తమిళనాడులో పెద్ద ప్రాధాన్యం లేదు. ఈ క్రమంలో విజయ్‌ సొంతంగా పార్టీ పెట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే […]

‘SIR కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్‌’- ఈసీ, బీజేపీపై మమతా ఫైర్​

ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కోల్‌కతాలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. E.C.ని పూర్తిగా రాజీపడిన సంస్థగా, SIRను మోసపూరితపనిగా TMC అభివర్ణించింది. BJP, ఎన్నికల సంఘం కలిసి జరిపే కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్‌ అని పేర్కొంది.  మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ఈ మార్చ్ కొనసాగిన ఈ ర్యాలీతో ఆ దారులన్నీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి.

‘జూబ్లీ ‘లో బిజెపికి జనసేన మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్‌ను మంగళవారం సాగర్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్య నాయకులతో మంతనాలు జరిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని బిజెపి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON