కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల దొంగతనం అంశాన్ని లేవనెత్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు హైకోర్టులో 22 ఎన్నికల పిటిషన్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో లేదా ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని ఏ పార్టీ అభ్యర్థి అయినా విశ్వసిస్తే అప్పీల్ దాఖలు చేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క అప్పీల్ కూడా దాఖలు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

