loader

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

ఏపీ డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ అనర్హుడని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా, ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో తనకు చేగువేరా ఆదర్శమని చెప్పాడని.. ఇప్పుడు సావర్కర్‌ను భుజాన వేసుకుని సనాతన ధర్మం […]

బీజేపీకి దగ్గరవుతున్న హేమంత్.. ?

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత,ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, సీబీఐ మరియు ఈడీ కేసుల వంటి అంశాల నేపథ్యంలో జేఎంఎం మరియు బీజేపీ మళ్లీ జట్టు కట్టే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ రెండు […]

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం

తెలంగాణలో జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కాంగ్రెస్ నేతలు.. పదవి వచ్చిందని పెత్తనం చేయకుండా పని చేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొత్త డీసీసీ అధ్యక్షుల పనితీరును ఆరు నెలల ప కాలంలో పరిశీలించి, సంతృప్తికరంగా లేకపోతే తీసేస్తామన్నారు. కొత్త నాయకత్వాన్ని నియమిస్తామన్నారు. ఈ నిర్ణయాన్ని ఎఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమర్థించారు. పార్టీలో ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్’ వ్యవస్థను ప్రవేశపెట్టే వ్యూహంలోనే దీన్ని అమలు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

పవన్‌కు మంత్రి మాస్ వార్నింగ్.. క్షమాపణ చెప్పకపోతే నీ సినిమా ఆడదు..

“తెలంగాణ ప్రజల దృష్టి కారణం” అని పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసి, వాటిపై తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి, పవన్ కల్యాణ్‌ను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి హోదాలో తాను చెప్పేది చాలా స్పష్టమని, క్షమాపణలు చెప్పకపోతే పవన్ నటించిన ఏ సినిమా కూడా తెలంగాణలో ఒక్క థియేటర్‌లోకి కూడా రానివ్వమని హెచ్చరించారు.

SIR‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాల ఆందోళ‌న‌.. లోక్‌స‌భ వాయిదా

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఇవాళ విప‌క్ష స‌భ్యులు .. సిర్ ప్ర‌క్రియ‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కాంక్షిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ నిర‌స‌న కొన‌సాగిస్తామ‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అన్నారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఇవాళ జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో రాహుల్ గాందీ, సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు […]

కర్ణాటకలో బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు.. డీకే నివాసానికి సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఊహాగానాల వేళ బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారం వేళ రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు డీకే ఇంటికి సీఎం సిద్ధూ బ్రేక్‌ఫాస్ట్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇంటికి వచ్చిన సీఎంకు డీకే ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌ మీట్‌లో […]

ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు? .. రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ రావు ఫైర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.వీరన్నది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయక బతుకులు భారమైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని బాండ్లు రాసిచ్చారని, అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేయడం దుర్మార్గమని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు

హామీలు నెరవేర్చకపోతే.. పదవి నుంచి తొలగించండి.. బాండ్ పేపర్‌తో సర్పంచ్ అభ్యర్థి

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ అయ్యేందుకు ఏకంగా బాండ్ పేపర్ పట్టుకొని తిరుగుతున్నాడు. తనను ఎన్నుకుంటే ఏకంగా గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం 22హామీలతో బాండ్ రెడి చేసి.. ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రతి ఏడాది 5 చొప్పున పూర్తిగా 22 హామీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నాడు సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు. లేని యెడల తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించుటకు సల్కాపురం గ్రామస్థులకు పూర్తి […]

ప్రేయసితో సర్పంచ్ నామినేషన్ – ఆపై వెంటనే పెళ్లి చేసుకుని ఠాణాకు పరుగు

సంగారెడ్డి మండలంలోని తాళ్లపల్లి గ్రామ పంచాయతీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్‌ సర్పంచిగా పోటీ చేసేందుకు ్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచి రిజర్వేషనేమో ఎస్సీకి రిజర్వు అయింది. తాను కొంతకాలంగా ప్రేమిస్తున్న యువతి ఎస్సీనే కావడంతో ఆమెను ఒప్పించి శనివారం పంచాయతీ ఎన్నికలకు నామినేషన్​ దాఖలు చేయించాడు. అంతేకాకుండా అదేరోజు సాయంత్రం మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. పోలీస్​ స్టేషన్​కు చేరుకొని తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని పోలీసులకు వెల్లడించారు.

ఏపీ హక్కుల కోసం పోరాడండి.. వైఎస్సార్‌ సీపీలతో ఎంపీ వైఎస్‌ జగన్‌

ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కులు సాధన కోసం పార్లమెంట్‌లో పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం తెలిసిందే. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON