loader

మూసీలో కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉంది.. సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయినా ఇంకా ప్రతిపక్ష పార్టీకి అహంకారం తగ్గలేదంటూ ధ్వజమెత్తారు. ఇంకొకాయన కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మూసీలోని కాలుష్యం కంటే వీళ్ళ కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఇకనైనా ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని… బరితెగించి వ్యవహరిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే.. కోర్టుకు వెళ్లండి: సీఎం రేవంత్ రెడ్డి

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించబోమని..ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన రెబల్ అభ్యర్థులతో కలిపి దాదాపు 66 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో కూటమిగా పోటీ చేసినప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 33 శాతం స్థానాలకే ఆ కూటమి పరిమితమైందని గణాంకాలతో సహా వివరించారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో మా పోటీ దుష్టశక్తి ‘డీఎంకే’తోనే : దళపతి విజయ్

తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, అగ్ర నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ డీఎంకేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకేను దృష్టశక్తిగా అభివర్ణించారు. తన పార్టీ టీవీకేను పవిత్ర శక్తిగా చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోటీ పవిత్ర శక్తి – దుష్టశక్తి మధ్యనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఈరోడ్‌లో నిర్వహించిన టీవీకే బహిరంగ సభలో […]

సీఎంకు ఎకనామిక్స్ టైమ్స్ అవార్డుపై లోకేష్ ట్వీట్…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. తమ కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకం అని మంత్రి లోకేష్ […]

లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్‌తో సమావేశం కానున్నారు. లోక్‌భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని రిక్వస్ట్ చేయనున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటికరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు నెలల క్రితం వైసీపీ ఉద్యమం చేపట్టింది. రెండు నెలల్లోనే కోటీ 4 లక్షల 11వేల 136 మంది సంతకాలు చేశారని వైసీపీ చెబుతోంది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని వివరించింది.

వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్: మరో కేసు నమోదు…

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో పలు కేసుల్లో రిమాండ్‌లోకి వెళ్లి ఇటీవలే వంశీ జైలు నుంచి విడుదలయ్యారు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు అయ్యింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు 8 మందిపై కూడా కేసు నమోదు అయ్యింది.2024 జూలై నెలలో వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ సునీల్ పోలీసులకు ఫిర్యాదు […]

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖూనీ చేసింది.. కేటీఆర్‌ ధ్వజం

ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని.. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ […]

కొనసాగుతున్న కౌంటింగ్.. మళ్లీ కాంగ్రెస్‌దే హవా

పంచాయతీ ఎన్నికల మూడో ఫేస్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటవరకూ 80.8 శాతం ఓటింగ్ నమోదైంది. 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి అధికార కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. మూడు విడతలు కలిపి 12,727 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 4,930 ఆధిక్యంలో ఉండగా.. 2,453 మంది బిఆర్ఎస్, 479 మంది బిజెపి, 1,249 మంది […]

గెలిచిన సర్పంచ్‌ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తాం..

తాండూర్ మండలం మాదారం 3 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్‌ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ నాయకులు నూతన సర్పంచ్‌ మండలంలోని ఒక నాయకుడి ద్వారా కాంగ్రెస్ పార్టీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ సర్పంచ్ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓడిన పుట్ట శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి ఆరోపించారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో కీలక అంశాలపై చర్చలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సోనియా గాంధీకి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌’ను అందజేశారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ఈ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON