తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, అగ్ర నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ డీఎంకేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకేను దృష్టశక్తిగా అభివర్ణించారు. తన పార్టీ టీవీకేను పవిత్ర శక్తిగా చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోటీ పవిత్ర శక్తి – దుష్టశక్తి మధ్యనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఈరోడ్‌లో నిర్వహించిన టీవీకే బహిరంగ సభలో స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విజయ్ విమర్శలు గుప్పించారు.

