loader

ఆ అక్రమ నిర్మాణంలో సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్‌రెడ్డి : హరీశ్‌రావు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదని, ముందుగా గోదావరి బనకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌.. నష్టనివారణ కోసం గోదావరి నల్లమల సాగర్‌కు మార్చుకుందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే, పాత్రధారి రేవంత్‌ రెడ్డి అని చెప్పారు. కత్తి చంద్రబాబుదే అయినా పొడిచేది మాత్రం రేవంత్‌రెడ్డి అన్నారు. అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నడా.. లేదంటే చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నడా నాకైతే అర్థమైతలేదు’ అని వ్యాఖ్యానించారు.

‘బంగాల్​కు దుశ్శాసనుడు వచ్చారు’- అమిత్ షా పర్యటనపై మమతా కౌంటర్​ ఎటాక్

బంగాల్​ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించేందుకు బంగాల్​కు వచ్చారు. ఎన్నికలు రాగానే దుశాసన, దుర్యోధనలు ఇద్దరు కనిపిస్తారు. ఈరోజు వచ్చి మమతా బెనర్జీ భూమి ఇవ్వట్లేదని వారు చెబుతున్నారు. సరిహద్దుల్లో కంచె నిర్మించేందుకు పెట్రాపోల్, అండాల్​లో తమ ప్రభుత్వం భూమిని కేటాయించిందని, 14 ఏళ్ల క్రితం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తు చేశారు.

గర్ల్‌ఫ్రెండ్ అవివా బేగ్‌తో, ప్రియంక గాంధీ కొడుకు రైహాన్ వాద్రా నిశ్చితార్థం!

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన ప్రేయసి అవీవా బేగ్‌తో రేహాన్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై గాంధీ, వాద్రా కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అవివా బేగ్ కుటుంబం ఢిల్లీలోనే నివసిస్తుందనీ, రెండు కుటుంబాలూ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయని సమాచారం.

తెలంగాణలో మరో ఎన్నికలకు ఈసీ రెడీ.. ఫిబ్రవరిలో మోగనున్న నగారా..!

తెలంగాణలో మరో స్ధానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కొర్పొరేషన్లలో ఓటర్ల సవరణ జాబితా సిద్దం చేయాలని ఈసీ నిర్ణయించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఓటర్ల లిస్ట్ సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 10లోపు పూర్తి చేయనుంది. దీని ఆధారంగా ఎన్నికలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి.

‘ప్రియాంక Vs రాహుల్ గాంధీ – కాంగ్రెస్ రెండు శిబిరాలుగా చీలిపోయింది!’

కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. కాంగ్రెలో ఒకటి ప్రియాంక గాంధీ వాద్రా శిబిరం, మరొకటి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ శిబిరమని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​లో రాహుల్ గాంధీ స్థానంలో వేరే వ్యక్తిని నియమించాలనే డిమాండ్ ఉందని విమర్శించింది. లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, విదేశీ గడ్డపై భారత్​ను అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార […]

ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్

అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. ఇవాళ నిఘా వ్యవస్థ లేదా.. ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజమైతే అధికారులు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టడం లేదని అడిగారు. ఈ సిట్ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎన్నిరోజులు మరలుస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎన్నిరోజులు కాలం వెల్లదీస్తారని నిలదీశారు.

పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్ లు చలో అసెంబ్లీ

మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మంత్రులు ఎమ్మెల్యేల్లు నిర్ణయం తీసుకోవాలని మాజీ సర్పంచ్ లు డిమాండ్ చేశారు. ఫెండింగ్ బిల్లులు రూ.531 కోట్లు విడుదల చేయాలని అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్థాపంతో సర్పంచులు చలో అసెంబ్లీ బాటపట్టారు.

RSS అలైఖైదా లాంటిది అంటూ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లక్ష్యాలను మరియు సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. RSS ఒక విద్వేషపూరిత సంస్థ అని, దానికి మరియు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు పెద్దగా తేడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో విభజన రాజకీయాలను ప్రోత్సహించే ఇటువంటి సంస్థల నుండి నేర్చుకోవడానికి ఏమీ లేదని ఆయన తెగేసి చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేత రాంరెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. మరోవైపు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్‌లు ముట్టడిస్తారనే సమాచారంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.

అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఘనస్వాగతం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకోవడంతో మంత్రివర్గంలో అలజడి మొదలైనట్టు తెలిసింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ను సభలోనే గట్టిగా నిలదీయాలని కేసీఆర్‌ నిర్ణయించి, పార్టీ సభ్యులను సిద్ధంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తున్నది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON