అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. ఇవాళ నిఘా వ్యవస్థ లేదా.. ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజమైతే అధికారులు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టడం లేదని అడిగారు. ఈ సిట్ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎన్నిరోజులు మరలుస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎన్నిరోజులు కాలం వెల్లదీస్తారని నిలదీశారు.

