loader

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదు

మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

ఈడీ VS మమత- తృణమూల్​ పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు

ఐ ప్యాక్‌ డైరెక్టర్​ ప్రతీక్​ జైన్‌ కార్యాలయం, నివాసంలో ఈడీ దాడులకు సంబంధించి టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. జనవరి 8న ఐ ప్యాక్‌ కార్యాలయం, ప్రతీక్‌ జైన్‌ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో, వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని స్వాధీనం చేసుకుని ఉండవచ్చునని టీఎంసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఆ డేటాను సంరక్షించాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని టీఎంసీ హైకోర్టును ఆశ్రయించింది.

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చంద్రబాబు తన స్వగ్రామంలో సందడి చేశారు. ఏటా ఆచారంగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గ్రామానికి చేరుకున్నారు. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు.

మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న

ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిణిలపై అనుచిత కథనాలు ప్రసారం చేశారన్న కారణంపై ఓ టీవీ చానల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టుల్ని హైదరాబాద్ సీసీఎస్ అరెస్టు చేయడం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు.రాహుల్ గాంధీని ఉద్దేశించి మీరు చెప్పే ‘మొహబ్బత్ కా దుకాణ్’ ఇదేనా?” అని ఎక్స్‌ వేదికగా సూటిగా […]

19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

కరూర్‌ దుర్ఘటనపై ఈ నెల 19న టీవీకే నేత విజయ్‌మళ్ళీ సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. సీబీఐ విచారణ కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన విజయ్‌.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా సీబీఐ విచారణ జరగాల్సి ఉన్న పరిస్థితులలో విజయ్‌ తరఫు న్యాయవాదులు సంక్రాంతి కారణంగా విచారణను పండుగ తర్వాత విచారణ కొనసాగించాలని కోరారు. అందుకు అంగీకరించిన సీబీఐ అధికారులు.. ఈ నెల 19న రావాలని సమన్లు […]

భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ

మాజీ మంత్రి రోజా కూడా నగరిలో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నేతలతో కలిసి ఆమె సంబరాలు జరుపుకున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు మెడికల్ కాలేజీ జీవోలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. రాష్ట్రంలో నిజమైన సంక్రాంతి వైసీపీ పాలనలోనే ఉందని ఇప్పుడు కేవలం చంద్రబాబు ప్యామిలీకే సంక్రాంతి ఉందని విమర్శించారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.

టీడీపీ ఎంపీకి బెదిరింపులు.. రూ.10 కోట్లు డిమాండ్

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్, ఆయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించి..రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ముంబైకి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కే అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు.. తనను తాను ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకొంటూ.. మీ ఆస్తుల చిట్టా విప్పుతానంటూ ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులకు దిగాడని వెల్లడించారు. తాను అడిగినంత మొత్తం ఇవ్వకపోతే కేంద్ర దర్యాప్తు బృందాలకు ఈ సమాచారం అందిస్తానని పదే పదే ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులకు […]

మహిళలను రెడీగా ఉండమన్నారు.. ఇంకెప్పుడు?

మహాలక్ష్మి పథకాన్ని ఎప్పటికి అమలు చేస్తారంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడును షర్మిల ప్రశ్నించారు. “రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతీగతి లేదు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ, మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు” అంటూ వైఎస్ షర్మిల […]

ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు భోగి పండుగ (జనవరి 14) సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భోగి పర్వదినం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ఆరంభంగా భోగి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఇది ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాలకు సంకేతమని సీఎం తెలిపారు.

బిహార్‌లో కాంగ్రెస్ ఖాళీ.. ఎన్డీయేకు జైకొట్టనున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు

రెండు నెలల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ కానుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్‌బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON