ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఆయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను బెదిరించి..రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ముంబైకి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కే అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు.. తనను తాను ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకొంటూ.. మీ ఆస్తుల చిట్టా విప్పుతానంటూ ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులకు దిగాడని వెల్లడించారు. తాను అడిగినంత మొత్తం ఇవ్వకపోతే కేంద్ర దర్యాప్తు
బృందాలకు ఈ సమాచారం అందిస్తానని పదే పదే ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు.

