ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిణిలపై అనుచిత కథనాలు ప్రసారం చేశారన్న కారణంపై ఓ టీవీ చానల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టుల్ని హైదరాబాద్ సీసీఎస్ అరెస్టు చేయడం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు.రాహుల్ గాంధీని ఉద్దేశించి మీరు చెప్పే ‘మొహబ్బత్ కా దుకాణ్’ ఇదేనా?” అని ఎక్స్ వేదికగా సూటిగా ప్రశ్నించారు.

