సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చంద్రబాబు తన స్వగ్రామంలో సందడి చేశారు. ఏటా ఆచారంగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గ్రామానికి చేరుకున్నారు. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు.

