ఐ ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయం, నివాసంలో ఈడీ దాడులకు సంబంధించి టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. జనవరి 8న ఐ ప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో, వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని స్వాధీనం చేసుకుని ఉండవచ్చునని టీఎంసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఆ డేటాను సంరక్షించాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని టీఎంసీ హైకోర్టును ఆశ్రయించింది.

