loader

కోల్‌ మాఫియాకు నాయకుడిలా తెలంగాణ సీఎం : కేటీఆర్‌

సింగరేణిలో అవినీతి వెలికితీశాక పాలకుల్లో వణుకు మొదలైందని. తెలంగాణ సీఎం కోల్‌ మాఫియాకు నాయకుడిలా మారిపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను ఫిర్యాదు చేశారు. ఏ బొగ్గుగనిలో లేని నిబంధన సైట్‌ విజిట్‌ సర్టిఫికేషన్‌ విధానం ఎందుకు పెట్టారు…? ఎవరికి లాభం చేయడానికి పెట్టారు. అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు […]

తమిళనాట డీఎంకే కూటమిలో ప్రకంపనలు – పవర్ షేరింగ్ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్

తమిళనాడులో  డీఎంకే నేతృత్వంలోని  కూటమి పార్టీల్లో  విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.రాష్ట్ర ప్రభుత్వంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్న కాంగ్రెస్ నేతల డిమాండ్‌పై డీఎంకే సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవినే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న బాహాట విమర్శలు కూటమి ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. డీఎంకే ఎమ్మెల్యే  జి. తలపతి ..  కాంగ్రెస్ ఎంపీలు బి. మాణిక్యం ఠాగూర్  , ఎస్. […]

మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. రేపటి నుంచే నామినేషన్‌లు

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడవు ముగియనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.

టీడీపీ పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు

మంత్రి నారా లోకేశ్​ టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కమిటీలను స్వయంగా ఆహ్వానించిన లోకేశ్​, ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించారు. శిక్షణ తరగతులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, 83 శాతం మంది కొత్త వారికి పార్లమెంట్ కమిటీల్లో తొలిసారి చోటు కల్పించినట్లు మంత్రి లోకేశ్​ తెలిపారు.

సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సోమవారం రాత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దేశంలో లేని సమయంలో నలుగురు మంత్రులు సమావేశం కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు మంత్రులు సమావేశం కావడంలో ఆశ్చర్యం లేదన్నారు. సీఎం అందుబాటులో లేనప్పుడు పాలనాపరమైన అంశాలపై మంత్రులు చర్చించుకోవడంలో తప్పులేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రెడ్ బుక్‌కు నా కుక్క కూడా భయపడదు.. అంబటి రాంబాబు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్‌కు తన కుక్క కూడా భయపడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అంబటి రాంబాబు పరామర్శించారు. నారా లోకేష్ రెడ్ బుక్‌లో తన పేరుందో లేదో చూసి చెప్పాలన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారనే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఆలయాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు […]

ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలి : ప్రధాని మోదీ

ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే దేశ భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలకపాత్ర పోషించే భాగ్యవిధాతలు ఓటర్లేనని చెప్పారు. మన దేశ విధిని మార్చగలిగే శక్తి ప్రజలు వేసే ఓట్లకు ఉంటుందని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై-భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా భారత్‌ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం చాలా కీలకమని ప్రధాని […]

ఏబీఎన్‌ చానల్‌ను బహిష్కరించిన బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్‌ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. ఇకపై అన్ని రకాల బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశాలకు ఏబీఎన్‌ ఛానల్‌ ప్రతినిధులను అనుమతించకూడదని అధిష్ఠానం నిర్ణయించింది. అలాగే ఏబీఎన్‌ టీవీ చానల్‌ చర్చలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొనరాదని తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌ ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.

హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్‌

హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో హిందీకి ఎప్పుడూ స్థానం లేదని, భవిష్యత్తులోనూ ఉండదని స్టాలిన్‌ స్పష్టంచేశారు. ఆదివారం నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు హిందీకి వ్యతిరేకంగా గతంలో తీవ్ర పోరాటం చేశారని స్టాలిన్‌ గుర్తుచేశారు. హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారీ.. అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.

ఇందిరమ్మ చీరలు తీసుకుంటే రేపు నోటీసులు వస్తాయి: ఎర్రబెల్లి దయాకర్ రావు

‘ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ ఇందిరమ్మ చీరలు ఉచితం కావు. ఒక్కో చీర పేరుతో మీ పేరు మీద రూ. 1,200 అప్పు రాస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది.’అంటూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉచితమని చెప్పి చీరలు ఇస్తున్నారు, రేపు అదే మహిళలకు ఆ డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు. ఆధార్ కార్డు వివరాలు సేకరించడం, వేలిముద్రలు తీసుకోవడం వెనుక […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON