తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. పలుచోట్ల ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈక్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను వరంగల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

