గుజరాత్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో అనేకమంది కార్మికులు గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన గుజరాత్, భరూచ్ జిల్లా, ఝగాడియా ప్రాంతంలోని జీఐడీసీ పరిధిలో గురువారం జరిగింది. ఇక్కడ ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే రసాయనాల్ని భారీగా తయారు చేస్తారు. దేశంలోని కీలక రసాయన పరిశ్రమల్లో ఇదీ ఒకటి. ఈ పరిశ్రమ పరిధిలో ఒక పేలుడు జరిగింది. దీని కారణంగా మంటలు భారీ స్థాయిలో వ్యాపించాయి. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయపడ్డారు.

