అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం చట్టాన్ని రద్దు చేయాలన్నది ట్రంప్ పాత వాదనకు మద్దతుగా మైఖేల్ సావేజ్ రాసిన లేఖలో భారత్, చైనా వంటి దేశాలను “నరకం” తో పోల్చారు. “చైనా, భారత్ వంటి నరకం నుంచి వచ్చే గ్యాంగ్‌స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది, మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు” అన్న సావేజ్ లేఖ ట్రంప్ సమర్థిస్తూ పోస్ట్ చేయడం ఆయన అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోంది. భారతీయులను ఈ లేఖలో “ల్యాప్‌టాప్‌లతో ఉన్న గ్యాంగ్‌స్టర్‌లు” గా వర్ణించడం గమనార్హం.

