UGC 2018 మార్గదర్శకాల ప్రకారం,అడ్మిషన్ల సమయంలో కళాశాలలు కేవలం ధృవీకరణ కోసం మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్లనుచూడాలి. అడ్మిషన్ రికార్డుల కోసం కేవలం స్వీయ-ధృవీకరించిన (Self-attested) జిరాక్స్ కాపీలను మాత్రమే ఉంచుకోవాలి. తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే ముందుగా కళాశాల అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ హెడ్‌కు ఫిర్యాదు చేయాలి. అక్కడ ఫలితం లేకపోతే నేరుగా UGCకి ఆన్‌లైన్ లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అట్టిపెట్టుకోవడం చట్టరీత్యా నేరం.

