హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సోమవారం రాత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దేశంలో లేని సమయంలో నలుగురు మంత్రులు సమావేశం కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు మంత్రులు సమావేశం కావడంలో ఆశ్చర్యం లేదన్నారు. సీఎం అందుబాటులో లేనప్పుడు పాలనాపరమైన అంశాలపై మంత్రులు చర్చించుకోవడంలో తప్పులేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

