loader

బీజేపీ అందరినీ ప్రచారానికి తెచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? : సీఎం రేవంత్‌రెడ్డి

పాలమూరు జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రచారానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాని సహా దేశం మొత్తం నేతలను తీసుకురండని హితువు పిలికారు. బీజేపీ అందరినీ ప్రచారానికి తెచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? అడిగారు. కాంగ్రెస్‌ పార్టీ సత్తా ఏంటో బీజేపీకి చూపిస్తామని సవాల్ విసిరారు.కరీంనగర్‌ జిల్లా గుమ్లాపూర్‌లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియాగాంధీ ఈ గడ్డపై నుంచి మాట ఇచ్చారని […]

పవన్.. రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా?: పేర్ని నాని

తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి.  అనేకసార్లు  దేవుడిపై నమ్మకం లేదన్న పవన్ . రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ […]

రేవంత్ రెడ్డి… ఎన్నిసార్లు రైతుబంధు ఇచ్చారో చెప్పాలి?: కేటీఆర్

సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్… మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు, కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారని,అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని  ఆరోపించారు.

సిట్‌ రిపోర్ట్‌ వైసీపీకి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు : పవన్‌ కల్యాణ్

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సిట్‌ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉందని, ఈ విషయంలో వైసీపీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారని అన్నారు. ఇప్పటికైనా చేసిన పాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. భగవంతుడి వద్ద మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టబోమని, హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా […]

రేవంత్‌రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్‌ వెనక్కి తీసుకోండి.. హార్వర్డ్‌ వర్సిటీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ లేఖ

సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్‌ యూనివర్సిటీకి లేఖ రాశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికి, దాదాపుగా 50 రోజులు జైలులో గడిపి, ఇప్పుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రతి చోటా అభ్యంతరకరమైన భాషను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాడని, ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ  శతాబ్దానికి పనికిరాడని, ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

“నార్త్ ఇండియన్స్‌కు హిందీ తప్ప ఏమీ రాదు..ఇక్కడకు వచ్చి పానీపూరీ అమ్ముకుంటారు”: తమిళనాడు మంత్రి సంచలనం

తమిళనాడు రాజకీయాల్లో భాషా వివాదం మరోసారి చిచ్చు రేపింది. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్‌ సెల్వం ఉత్తర భారత వలస కార్మికులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర భారతీయులకు కేవలం హిందీ మాత్రమే వచ్చిని.. వారికింకేది తెలియదని అన్నారు. అందుకే వారంతా ఇక్కడకు వచ్చి పానీపూరీలు అమ్ముకుని బతుకుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు.

| వైసీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి.. చంద్రబాబు శ్రేణులకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ఏపీ సీఎం చంద్రబాబు రెడ్ బుక్‌తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి, జంగిల్ రాజ్‌లా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకల దాడి, అంబటి రాంబాబు అరెస్టు వ్యవహరం తరువాత బుధవారం అంబటి కుటుంబాన్ని […]

రైతులందరూ ఏకమై రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయం : హరీష్‌ రావు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదు. మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు,మున్సిపాలిటీల్లో రైతులు ఉండరని, వాళ్లకు రైతుబంధు వేయకపోయినా నడుస్తుందని రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నాడు.సగం మున్సిపాలిటీల్లో ఉన్నది రైతులే. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రైతులందరూ ఏకమై రేవంత్ […]

అవ‌మానంతో చౌటుప్ప‌ల్ 17వ వార్డు కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

చౌటుప్ప‌ల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏక‌గ్రీవ ఎన్నిక‌ను నిర‌సిస్తూ ఆ వార్డు ఓట‌ర్లు బుధ‌వారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని ఆరోపిస్తూ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు తెలుపకుండా ఎలా నామినేషన్లు ఉప సంహరించుకుంటారని వారు ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకోకుంటే తాము చనిపోయినట్టేనని, తమకు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

తెలంగాణ గడ్డపై తొలిసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నితిన్ నబిన్ బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించే బూత్ సమ్మేళనంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇది ప్రజా సభ కాదని, సమావేశం అనంతరం ఆయన నేరుగా ఢిల్లీకి తిరిగి వెళ్తారని రామచందర్ రావు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON