సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా
ఏసీబీకి దొరికి, దాదాపుగా 50 రోజులు జైలులో గడిపి, ఇప్పుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రతి చోటా అభ్యంతరకరమైన భాషను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాడని, ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడని, ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

