loader

వైసీపీ చైర్‌పర్సన్ సహా నలుగురు కౌన్సిలర్ల జంప్!

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ తరఫున 4వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి, ప్రస్తుతం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బావన రత్నకుమారి తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గళగిరిలో టీడీపీ కీలక నేత పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బావన రత్నకుమారి మరియు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ బలం తగ్గి, టీడీపీ తన ఆధిక్యాన్ని […]

ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరు

దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు […]

క్యాతనపల్లిలో హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్ట్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఇంటి చుట్టు పోలీసులు మోహరించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో భారీగా అక్కడికి చేరుకున్న కార్యకర్తలు అరెస్టును అడ్డుకొనే ప్రయత్నం చేశారు.తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని.. బిఆర్ఎస్, సిపిఐ మహిళ కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో బుధవారం పట్టణ బంద్‌కు బిఆర్ఎస్, సిపిఐ పిలుపునిచ్చింది.

రికార్డు సృష్టించిన స్పీకర్ కుమార్తె

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య (24) అతి పిన్న వయసులోనే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. వికారాబాద్‌కు చెందిన అనన్య, కాంగ్రెస్ పార్టీ తరపున 17వ వార్డు నుంచి విజయం సాధించి, ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి నీడలో కాకుండా, క్షేత్రస్థాయి రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని అనన్య తెలిపారు. వికారాబాద్ అభివృద్ధికి కృషి […]

రాంబాబుకు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సత్తెనపల్లి ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించిన అవినీతి కేసులో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్..నా దుడ్లతోనే మ్యాచ్ చూశాను..నీ దుడ్లను ఏమైనా ఖర్చు చేశానా?: లోకేష్

టి20 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్-టిమిండియా జరిగిన మ్యాచ్‌ను ఎపి మంత్రి నారా లోకేష్ కొలంబో స్టేడియంలో వీక్షించారు. ప్రభుత్వ సొమ్మును మంత్రి లోకేష్ వృధా ఖర్చు చేస్తున్నారని వైసిపి నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఫ్లైట్ టికెట్ తనదేనని, మ్యాచ్ టికెట్ కూడా తనదేనని అని తెలిపారు. తన దుడ్లతోనే మ్యాచ్ చూశానని, వైసిపి అధినేత జగన్ దుడ్లను ఏమైనా ఖర్చు […]

క్యాతన్ పల్లిలో కొనసాగుతున్న బంద్

మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో బంద్ కొనసాగుతుంది. బిఆర్ఎస్, సిపిఐ బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌లో పాల్గొన్నారు. బిఆర్ఎస్ బంద్‌తో క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్నటి రాళ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అరెస్టు పర్వం కొనసాగుతుంది.

శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యిపై చర్చ

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం పై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. మంగళవారం, బుధవారం కూడా వైసీపీ తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని అందజేయగా, ఛైర్మన్ దానిని డిస్మిస్ చేశారు.మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందుకే మండలిలో చర్చకు డిమాండ్ […]

వన్ క్లాస్-వన్ టీచర్ స్కూల్స్‌ను 33శాతానికి పెంచాం: మంత్రి నారా లోకేశ్

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ‘గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం చాలా కీలకమైంది. గతంలో 3శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ – వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33శాతానికి పెంచాం. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అంది, పరీక్షల్లో మెరుగైన […]

తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, కేసీఆర్ 72 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON