మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఇంటి చుట్టు పోలీసులు మోహరించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో భారీగా అక్కడికి చేరుకున్న కార్యకర్తలు అరెస్టును అడ్డుకొనే ప్రయత్నం చేశారు.తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని.. బిఆర్ఎస్, సిపిఐ మహిళ కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో బుధవారం పట్టణ బంద్కు బిఆర్ఎస్, సిపిఐ పిలుపునిచ్చింది.

