loader

మిథున్ రెడ్డి అరెస్ట్‌పై YS జగన్ రియాక్షన్..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్. రాజకీయ కుట్రతోనే ప్రజల పక్షాన నిలబడే వారి నోరు మూయించడానికి చేసిన అక్రమ అరెస్ట్‌గా భావిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం తమ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకారచర్యగా చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా మిథున్ రెడ్డికి తన మద్దతు తెలిపారు వైఎస్ జగన్

డీకేపై సిద్దరామయ్య సంచలన కామెంట్స్‌..కర్నాటక రాజకీయాల్లో హైడ్రామా

ఓ సభలో చిరాకుగా ఉన్న సిద్ధరామయ్య ప్రసంగాన్ని మధ్యలో ఆపి, “డికె శివకుమార్ వేదికపై కాదు, బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారిని మాత్రమే మేము స్వాగతిస్తాము. ఇంట్లో కూర్చున్న వారికి మేము శుభాకాంక్షలు తెలియజేయలేము” అని అన్నారు. డిప్యూటీ సీఎం, సీఎం మధ్య ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ఐదేండ్ల వరకు గద్దె దిగేది లేదంటూ సీఎం సిద్ద రామయ్య భష్మించుకోగా, ఒప్పందం ప్రకారం సీఎం సీటు తనకు అప్పగించాల్సిందేనంటూ డీకే పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో […]

కాపు ఉద్యమనేతకు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమం

కాపు ఉద్యమనేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. చాలా కాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో ఆయన్ని కాకినాడ నుంచి హుటాహుటిన మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే ఆయన పూర్తిగా కోలుకోవడం కష్టమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమంగానే ఉందని తెలియడంతో కాపు ఉద్యమ నేతలు, వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి: చంద్రబాబు

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగితే ప్రజలు క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ అధికారులు అందించిన వివరాలను సీఎం పరిశీలించారు. ఆపై తిరుపతికి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవాలయం పరిసరాల్లో పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, చెత్త తొలగించారు. .

రూ. 150 కోట్ల బ‌కాయిలు చెల్లించే స్థోమ‌త లేదా..ఆర్ఎస్పీ

పేద కుటుంబాల్లో పుట్టిన మెరికల్లాంటి పిల్లలకు, కార్పోరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ నిలిపేయాలని చూస్తుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పించడం ఇష్టం లేదా? కేవలం 150 కోట్ల బకాయిలు చెల్లించే స్థోమత లేదా? అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిల‌దీశారు.

బండి సంజయ్‌కు ఈటెల స్ట్రాంగ్ కౌంటర్.. ఎవ్వరికీ భయపడేదే లేదు!

తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. హుజురాబాద్‌లో ఓటమిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్ ఇచ్చారు.ఇకపై స్ట్రెయిట్ ఫైట్ ఉంటుందని, అవమానాలను ఎదుర్కొనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.కడుపులో కత్తులు పెట్టుకున్న వారితో పోరాడలమేన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని, తనకు తెలియని వారే లేరన్నారు. వీరుడు ఎక్కడా భయపడడని.. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని, ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని […]

కెటిఆర్… నీ జీవితంలో సిఎం కాలేవు: హనుమంతరావు

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ తో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో భార్యాభర్తల మాటలు కూడా విన్నావని, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల జీవితాలు నాశనం చేశావని ధ్వజమెత్తారు. కెటిఆర్, హరీష్ రావును సిఎం రేవంత్ ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జీవితంలో నువ్వు సిఎం కాలేవని మండిపడ్డారు. ఎపి, తెలంగాణ లొల్లి పెట్టాలని చూస్తున్నావని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి […]

ప్రశాంత్ కిషోర్‌కు తప్పిన ప్రమాదం..

ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ స్థాపించి.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. జనాల మధ్యలో నడుస్తుండగా.. గుర్తు తెలియని వాహనం వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు

ఎంపీలు..అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు..సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో మన ఎంపీల పని తీరు బాగుంది. క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. చర్చించే అంశాలపై రాష్ట్ర వాదనను సమర్థవంతంగా వినిపిస్తున్నారు.’ రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు, పెద్ద సంఖ్యలో ఎంపీలను ఇచ్చారు. ‘అనవసర విషయాల్లో ఎంపీలు ఎక్కడా జోక్యం చేసుకోవద్దు. వన్ టైం ఎంపీలుగా ఉండేలా ప్రవర్తించవద్దు. ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల మేరకు మీరు పని చేయాలి.అని సీఎం చంద్రబాబు […]

రాబ‌ర్ట్ వ‌ద్రాను ప‌దేళ్లుగా కేంద్రం వేధిస్తున్నది : రాహుల్

రాబర్ట్ వద్రాపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా వద్రాను రాజకీయ పరిభాషలో వేధిస్తున్నదని ఆరోపించారు. ఎటువంటి ద‌ర్యాప్తునైనా ఎదుర్కోవ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. త‌న సోద‌రి ప్రియాంకా గాంధీతో పాటు ఆమె కుటుంబం ఆ విచార‌ణ‌ను ఎదుర్కొంటుంద‌న్నారు. స‌త్యం ఎప్ప‌టికీ వ‌ర్ధిల్లుతుంద‌ని రాహుల్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON