బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ తో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో భార్యాభర్తల మాటలు కూడా విన్నావని,
ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల జీవితాలు నాశనం చేశావని ధ్వజమెత్తారు. కెటిఆర్, హరీష్ రావును సిఎం రేవంత్ ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జీవితంలో నువ్వు సిఎం కాలేవని మండిపడ్డారు. ఎపి, తెలంగాణ లొల్లి పెట్టాలని చూస్తున్నావని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే డైరెక్ట్ గా ఎటాక్ చేస్తామని మైనంపల్లి హెచ్చరించారు.

