ఓ సభలో చిరాకుగా ఉన్న సిద్ధరామయ్య ప్రసంగాన్ని మధ్యలో ఆపి, “డికె శివకుమార్ వేదికపై కాదు, బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారిని మాత్రమే మేము స్వాగతిస్తాము. ఇంట్లో కూర్చున్న వారికి మేము శుభాకాంక్షలు తెలియజేయలేము” అని అన్నారు. డిప్యూటీ సీఎం, సీఎం మధ్య ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది.
ఐదేండ్ల వరకు గద్దె దిగేది లేదంటూ సీఎం సిద్ద రామయ్య భష్మించుకోగా, ఒప్పందం ప్రకారం సీఎం సీటు తనకు అప్పగించాల్సిందేనంటూ
డీకే పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.

