కాపు ఉద్యమనేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. చాలా కాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో ఆయన్ని కాకినాడ నుంచి హుటాహుటిన మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే ఆయన పూర్తిగా కోలుకోవడం కష్టమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమంగానే ఉందని తెలియడంతో కాపు ఉద్యమ నేతలు, వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

